
‘మనకి ఇద్దరే క్లైంట్స్ రా’ ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో వచ్చిన ‘రెడీ’ (Ready) సినిమాలో మెక్ డొనాల్ మూర్తి(బ్రహ్మానందం) (Brahmanandam) హీరోతో(రామ్ తో) (Ram) పలికే డైలాగ్. విలన్స్ ఇద్దరి దగ్గర టాక్సుల రూపంలో లక్షలు దోచేస్తూ.. వాళ్లపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. అందుకే ఆ డైలాగ్ చెబుతాడు. కానీ ఈ ఒక్క డైలాగ్ ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇప్పుడు ఈ డైలాగ్ ప్రస్తావన ఎందుకంటే..
Chandoo Mondeti
దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) గురించి మాట్లాడుకోవాలి కాబట్టి..! ఆ డైలాగ్ కి చందూ మొండేటికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! అతను ఇప్పటివరకు ‘కార్తికేయ’ (Karthikeya) ‘ప్రేమమ్’ (Premam) ‘సవ్యసాచి’ (Savyasachi) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ‘తండేల్’ వంటి సినిమాలు చేశాడు. ఈ 5 సినిమాల్లో నిఖిల్ తో 2,నాగ చైతన్యతో (Naga Chaitanya) 3 ఉన్నాయి. అందుకే ‘తండేల్’ (Thandel) రిలీజ్ టైంలో చందూ మొండేటి గురించి పైన చెప్పుకున్న బ్రహ్మి డైలాగ్ తో మీమ్స్ చేశారు. అది ఆ క్లైంట్స్ వ్యవహారం.
అయితే ఇప్పుడు చందూ మొండేటి తన క్లైంట్స్ ను దాటి వేరే హీరోని పట్టినట్టు తాజా సమాచారం. అవును చందూ ఇప్పుడు నాగ చైతన్య, నిఖిల్ ను కాకుండా వేరే హీరోని పట్టాడు. అతను మరెవరో కాదు రామ్. వాస్తవానికి ‘తండేల్’ తర్వాత సూర్యతో (Suriya) ఓ సినిమా చేయాలని చందూ మొండేటి అనుకున్నాడు.
కానీ సూర్య.. వెంకీ కుడుములతో (Venky Kudumula) సినిమా చేయడానికి కమిట్ అవ్వడంతో… ఇప్పట్లో అతని డేట్స్ దొరకడం కష్టం. అందుకే చందూ మొండేటి.. రామ్ ని కలిసి అతనికి ఒక కథ వినిపించాడు.అది అతనికి నచ్చిందట. ‘గీతా ఆర్ట్స్’ లో చందూ ఇంకో సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఆ బ్యానర్లోనే చేసే అవకాశం ఉంది.