
విక్కీ కౌశల్ (Vicky Kaushal) ,రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా నటించిన ఛావా (Chhaava) సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటివరకు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు సైతం వంద కోట్ల మార్కును చేరుకోవడం కష్టతరమైన పరిస్థితిలో, ఛావా అంతటి గ్రాస్ రాబట్టడం విశేషంగా మారింది. హిందీ వర్షన్‌లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.516 కోట్లు వసూలు చేయడం రికార్డు స్థాయిలో నిలిచింది.
Chhaava
దీంతో, ఇండియాలో బాహుబలి 2 (Baahubali 2) హిందీ వర్షన్‌ను దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు సినిమా అయిన బాహుబలి 2 హిందీలో అత్యధికంగా రూ.510 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఛావా ఆ రికార్డును అధిగమించడంతో బాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే, ఇదే వారం రిలీజ్ అయిన ఇతర బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపకపోవడం కూడా ఛావాకు కలిసి వచ్చింది.
పుష్ప 2 (Pushpa 2) ఇప్పటికే బాహుబలి 2 హిందీ వర్షన్ రికార్డును దాటి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేయగా, ఇప్పుడు ఛావా కూడా అదే జాబితాలో చేరబోతుందా అన్న ప్రశ్న నెలకొంది. ఇదిలా ఉంటే, ఇటీవలే తెలుగు ప్రేక్షకుల కోసం ఛావా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేశారు. మొదటి మూడు రోజుల్లో రూ.9 కోట్ల షేర్ వసూలు చేసినప్పటికీ, హిందీ రేంజ్‌లో వసూళ్లు రాబట్టే స్థాయిలో మాత్రం లేదు.
హిందీ వెర్షన్ భారీ విజయాన్ని సాధించడంతో పాటు నార్త్ ఇండియాలో సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ తెలుగు మార్కెట్‌పై కొంత ప్రభావం చూపించిందనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయబోతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే, మరికొన్ని వారాల పాటు థియేట్రికల్ రన్ కొనసాగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మొత్తం బిజినెస్ రూ.1000 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.