
తెలుగు బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ కావాలంటే కంటెంట్‌తో పాటు స్ట్రాంగ్ ప్రమోషన్, సరైన విడుదల వ్యూహం అవసరం. గతంలో కాంతార సినిమా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ కేవలం 2.5 కోట్ల బిజినెస్‌తో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, 29 కోట్లకు పైగా షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్‌కి లాభాల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే బ్యానర్ ఛావా (Chhaava) సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Chhaava
మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఇప్పటికే 600 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. తెలుగులో ఈ సినిమా విడుదల హక్కుల కోసం పోటీ గట్టిగానే సాగింది. చివరకు గీతా ఆర్ట్స్ మంచి డీల్ కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీలో హిట్ అయిన సినిమా కావడంతో, తెలుగు మార్కెట్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేదే ఇప్పుడు కీలకం. ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు, ఛావా హక్కులను గీతా ఆర్ట్స్ చాలా రీజనబుల్ ధరకు తీసుకుంది.
కాంతార తరహాలో ఈ సినిమాను ప్రమోట్ చేసి, మౌత్ టాక్ బలంగా వచ్చినట్లయితే, గీతా ఆర్ట్స్ మళ్లీ ఒక మినీ బ్లాక్‌బస్టర్ కొట్టే అవకాశం ఉంది. అయితే ఈసారి, టైమింగ్, పోటీ, థియేట్రికల్ రన్ అన్ని కీలక పాత్ర పోషించనున్నాయి. మార్చి నెల ఎగ్జామ్ టైమ్ కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పైగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) రీ-రిలీజ్ కూడా ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఛావా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే ఫస్ట్ వీకెండ్ హైపే కీలకం. భారీ ఓపెనింగ్స్ వస్తే, స్టడీ రన్ కొనసాగించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక మౌత్ టాక్ ఎలా వస్తుందన్నదే అసలైన ప్రశ్న. హిందీలో ఈ సినిమాకు వచ్చిన స్పందన దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకర్షించగలిగితే, మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ మరోసారి చిన్న బిజినెస్‌తో బిగ్ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తోంది. మరి, ఈ వ్యూహం ఫలిస్తుందా? లేదా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.