
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ (Kannappa) రూపొందుతున్న తెలిసిందే. ఇది భక్తి సినిమా. ఇప్పటి జనరేషన్ కి పరమశివుని గొప్పతనం, అలాగే ఓ నాస్తికుడు అయినటువంటి తిన్నడు.. శివుని భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు అనే థీమ్ తో ఈ సినిమా రూపొందుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు (Mohan Babu), మోహన్ లాల్ (Mohanlal) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , శరత్ కుమార్ (Sarathkumar) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) , కాజల్ (Kajal Aggarwal) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
Kannappa
అయితే ‘కన్నప్ప’ వార్తల్లో నిలవడానికి ఇది మెయిన్ రీజన్ కాదు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా నటిస్తున్నాడు. రుద్ర పాత్రలో అతను కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి టికెట్లు తెగేది ప్రభాస్ పేరుపైనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ కంటెంట్ బాగుంటే దీనికి బోనస్ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్లు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
కానీ ‘శివ శివ శంకర’ అనే పాట మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇదే క్రమంలో ‘సగమై.. చెరిసగమై’ అనే లవ్ సాంగ్ ను కూడా వదిలారు. అయితే ఈ పాట వినడానికి ఎలా ఉన్నా.. విజువల్ గా హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో హీరోయిన్ ప్రీతి ముకుందన్ గ్లామర్, అలాగే మంచు విష్ణుతో ఆమె రొమాన్స్ శృతి మించింది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి.
‘భక్తి సినిమాలో ఇలాంటి రక్తి పాట అవసరమా?’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే ‘సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుని ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నాడేమో’ అని మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అలా ఈ పాట కూడా వార్తల్లో నిలవడం విశేషం.