
‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు (S. Radha Krishna) కూతురు, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ (Suryadevara Naga Vamsi) సోదరి అయినటువంటి హారిక నిర్మాణంలో ‘మ్యాడ్’ (MAD) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 6న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి నాగవంశీ సమర్పకులుగా వ్యవహరించారు. ఆయన చెప్పినట్టు మరీ ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) రేంజ్ వసూళ్లు రాబట్టలేదు కానీ.. ‘మ్యాడ్’ తో బయ్యర్స్ అంతా లాభాలు అందుకున్నారు అని చెప్పవచ్చు.
MAD Square
ఇక దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు అది రెడీ అయ్యింది కూడా. ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల మార్చి 29 కి వాయిదా పడింది. దానికి ఒక్కరోజు ముందు అంటే.. మార్చి 28న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), నితిన్ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’ (Robinhood) రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇందులో ‘హరిహర వీరమల్లు’ వస్తుందనే నమ్మకం అభిమానులకి కూడా లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) ని ఒక రోజుకి ముందుకు జరిపి అందరికీ షాకిచ్చారు మేకర్స్.
దానికి కారణాలు ఏంటి అన్నది రివీల్ చేయలేదు కానీ.. శనివారం ఉగాది పండుగ సెలవు.. పైగా వీకెండ్ ఉంది. ఇక సోమవారం అంటే మార్చి 31న రంజాన్ హాలిడే కూడా ఉంది. సో సెలవులకి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక నితిన్ ‘రాబిన్ హుడ్’ ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది డిసెంబర్ 25 నే రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.