
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ ఇటీవల సినీ విశేషాలతో కాకుండా ఫ్యామిలీ వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) – మౌనిక భూమా వివాహానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోజ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కచ్చితంగా సమయం కేటాయిస్తుంటాడని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. మౌనిక భూమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనోజ్, పిల్లలతో ఉన్న ఒక అందమైన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగంతో కూడిన మెసేజ్ రాసింది.
Manchu Lakshmi
“మనిద్దరం కలిసి ముందుకు సాగాలని, మరింత ప్రేమతో జీవితం కొనసాగాలని కోరుకుంటున్నా. నువ్వు నాకు అందించిన కుటుంబం నాకు గొప్ప బహుమతి. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్.. లెట్స్ రాక్ అండ్ రోల్!” అంటూ తన ప్రేమను వ్యక్తం చేసింది. మౌనిక పంచుకున్న ఈ మెసేజ్, ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కూడా అందుకు చాలా పాజిటివ్ గా స్పందించారు. ఈ పోస్ట్ చూసిన మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ఎమోషనల్‌గా స్పందించింది. “నీ పోస్ట్ బాగుంది మౌనిక.. నలుగుర్నీ ఎంతో ప్రేమిస్తున్నాను.
ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ప్రేమగా కలిసుండాలి. మీరు ఎప్పుడూ హ్యాపీ ఫ్యామిలీలా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేసింది. మంచు లక్ష్మీ (Manchu Lakshmi) మనోజ్‌కు ఎంతగా అనుబంధం ఉందో ఈ మాటల్లో స్పష్టమవుతోంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో అనేక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, లక్ష్మీ మాత్రం ఎప్పుడూ తమ్ముడి వెంటే ఉంటుందని మరోసారి నిరూపించింది. ఇటీవల మనోజ్ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు.
ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకటిగా ఉండగా, మనోజ్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో మౌనిక చేసిన పోస్ట్, లక్ష్మీ స్పందన మరోసారి ఫ్యామిలీ బంధాలను హైలైట్ చేస్తోంది. ఇక ఫ్యామిలీలో ఏ మార్పులు జరిగినా, మనోజ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మౌనిక భూమా తన భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నట్లు తాజా పోస్ట్ ద్వారా స్పష్టమైంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram