
రామ్ చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16 (RC 16 Movie) షూటింగ్ నాన్ స్టాప్‌గా కొనసాగుతోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి టీమ్ హై స్పీడ్‌లో పనిచేస్తోంది. ఇతర పెద్ద సినిమాలతో పోల్చితే, బ్రేక్‌లు తీసుకోకుండా వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు ఎక్కువ భాగం ఔట్‌డోర్ లొకేషన్లను ఎంచుకోవడంతో, వర్చువల్ సెట్స్ అవసరం లేకుండా వేగంగా షూటింగ్ పూర్తవుతుందనేది సమాచారం.
RC16
ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ హిట్ గా నిలవనుందని టాక్. రంగస్థలం (Rangasthalam) తరహాలో నేటివిటీ ఎమోషన్ ఉంటుందని, ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఇందులో చరణ్ ఒక రఫ్ అండ్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటూ తన క్యారెక్టర్ కోసం ఫిజిక్ మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఉండే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలవనుందట.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , జగపతిబాబు (Jagapathi Babu) వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టార్కాస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, ప్రొడక్షన్ పరంగా కూడా చాలా రిచ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ కూడా హైపెక్కించేలా ఉంటుందని చెప్పొచ్చు.
ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌పై ఉంది. త్వరలోనే మూవీ ప్రమోషన్ స్టార్ట్ అవుతుందనేది టాక్. బుచ్చిబాబు తన స్టైల్ నేటివిటీ కథనాన్ని, రామ్ చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మిక్స్ చేసి, భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫైనల్ గా ఈ ఏడాదిలోనే షూటింగ్ ఫినిష్ చేయాలని దర్శకుడి ప్లాన్. ఇక 2026 సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి RC16 మరో మాసివ్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా అనేది చూడాలి.