
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) నుండి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ‘శబ్దం’(Sabdham). ఫిబ్రవరి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకి అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహించారు. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. 14 ఏళ్ళ క్రితం ఇదే కాంబినేషన్లో ‘వైశాలి’ అనే హిట్టు సినిమా వచ్చింది. తెలుగులో కూడా అది బాగా ఆడింది. అందుకే ‘శబ్దం’ పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. దీనికి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ‘వైశాలి’ రేంజ్లో కాదు.
Sabdham Collections:
ఓపెనింగ్స్ కూడా అలాగే యావరేజ్ గా వచ్చాయి. అయితే 4వ రోజు అంటే మొదటి సోమవారం నాడు డౌన్ అయిపోయింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.34 cr |
సీడెడ్ | 0.14 cr |
ఆంధ్ర(టోటల్) | 0.35 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.83 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 4 రోజుల్లో ఈ సినిమా రూ.0.83 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.35 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.67 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో స్టడీగా రాణించకపోతే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని చెప్పాలి.