
ఫిబ్రవరి నెలలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఇలాంటి టైంలో రెగ్యులర్ మూవీ లవర్స్ ఏ కొత్త సినిమా వచ్చినా దానిని మిస్ చేసుకోకుండా చూస్తారు. అలాంటిది ‘శబ్దం’ (Sabdham) వంటి హారర్ సినిమా వస్తుంది అంటే.. లైట్ తీసుకుంటారా? ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వైశాలి’ వంటి డీసెంట్ హారర్ మూవీని అందించిన అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకుడు. తమన్ (S.S.Thaman) సంగీతం అందించడం విశేషంగా చెప్పుకోవాలి.
Sabdham Collections:
మొదటి రోజు సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా తక్కువే. అయినా ఈ సినిమా క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేకపోతుంది. దానికి ప్రధాన కారణం సరైన ప్రమోషన్ చేయకపోవడం అనే చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.39 cr |
సీడెడ్ | 0.17 cr |
ఆంధ్ర(టోటల్) | 0.38 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.94 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 6 రోజుల్లో ఈ సినిమా రూ.0.94 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.54 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మార్చి 7న కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ‘శబ్దం’ ఇక వినిపించడం కష్టం.