
టాలీవుడ్‌లో ఓ టైమ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న శర్వానంద్ (Sharwanand) , ప్రస్తుతం తన కెరీర్‌లో గాడితప్పిన దశలో ఉన్నాడు. శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వా, టైర్ 2 హీరోగా నిలిచాడు. కానీ ఆ స్థాయిని కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. గత ఐదేళ్లుగా వచ్చిన సినిమాల్లో ఒక్కటీ కూడా పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ తీసుకు రాలేదు. పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu), రణరంగం (Ranarangam), జాను (Jaanu), శ్రీకారం (Sreekaram) , మహా సముద్రం (Maha Samudram), ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu) వరుసగా డిజాస్టర్లుగా మారాయి.
Sharwanand
వీటికి తోడు, ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోదగ్గదే అయినా, కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా నిరాశే మిగిల్చింది. థియేటర్‌లో పెద్దగా ఆడకపోవడం, ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో, మరో ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వా తన టైర్ 2 స్టేటస్‌ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్‌లో నాని (Nani), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, శర్వా మాత్రం పూర్తిగా వెనకబడిపోయాడు.
ఓటీటీలో కూడా ఫాలోయింగ్ పెరగని నేపథ్యంలో, ఇప్పుడు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా స్క్రిప్ట్ ఎంపికలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం శర్వానంద్ శర్వా 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌తో బిజీగా ఉన్నాడు. అదే విధంగా మరో కామెడీ డ్రామా కూడా లైన్‌లో ఉంది. ఇకపై ఏదైనా సినిమా హిట్ అయితేనే శర్వా తిరిగి తన స్తాయిని పెంచుకోగలడు.
లేదంటే, మరో రెండు ఫెయిల్యూర్స్ అయితే పూర్తిగా మార్కెట్ డౌన్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో శర్వా మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకోవాలి, లేదంటే టాలీవుడ్‌లో మరో మంచి హీరోను కోల్పోయినట్లే అవుతుంది.