
విక్టరీ వెంకటేష్ (Venkatesh) , సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). 2013 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. క్లాస్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది హీరోల వలనే అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా.. దాదాపు 12 ఏళ్ళ తర్వాత ఈ మార్చి 7న ‘సీతమ్మ వాకిట్లో..’ (SVSC) రీ- రిలీజ్ అయ్యింది.
SVSC Collections:
ఈసారి కూడా ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. అన్ సీజన్లో, ఓ రీ- రిలీజ్ సినిమా రెండో రోజు కూడా హోల్డ్ చేయడం చిన్న విషయం కాదు అనే చెప్పాలి. ఒకసారి (SVSC)(రీ- రిలీజ్) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.48 cr |
సీడెడ్ | 0.33 cr |
ఉత్తరాంధ్ర | 0.63 cr |
ఈస్ట్ | 2.44 cr |
వెస్ట్ | 0.93 cr |
కృష్ణా | 3.37 cr |
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా రీ- రిలీజ్లో రెండో రోజు కూడా రూ.3.37 కోట్ల(గ్రాస్) వసూళ్లు వచ్చాయి. ఆదివారం రోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి. సో 3వ రోజు కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.