
నేచురల్ స్టార్ నాని (Nani) ఎప్పుడూ కొత్తదనం కోరుకునే నటుడు. గతంలో తన సినిమాల కోసం విభిన్నమైన కథలను ఎంచుకున్న అతను, ‘దసరా’ (Dasara) తర్వాత మరింత మాస్, రఫ్ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ (The Paradise) పేరుతో మరో విభిన్నమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు, అందుకే కథను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
The Paradise
నాని గెటప్, బ్యాక్‌డ్రాప్, రఫ్ లుక్ అన్ని కూడా సినిమాకు కొత్త వైబ్ ఇస్తున్నాయి. కేవలం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, ఇంటెన్స్ కథాంశంతో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలు రెండు పార్ట్‌లుగా రావడం నార్మల్ అయిపోయింది. అదే ట్రెండ్‌లో ‘ది ప్యారడైజ్’ కూడా నిలవనుందనే టాక్ బలపడుతోంది. ఈ సినిమా సంగీతం అనిరుధ్ (Anirudh Ravichander) అందిస్తున్నాడు. ఆయన మ్యూజిక్ గతంలో నాని సినిమాలకు మంచి బూస్ట్ ఇచ్చినట్లు, ఇప్పుడు కూడా అదే మేజిక్ వర్కౌట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఉంది. ‘దసరా’ విజయం తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త యాక్షన్ డ్రామా నాని కెరీర్‌లో మరో ట్రెండ్ సెట్టర్ గా మారే అవకాశం ఉంది. ఈ సినిమా మొదటి భాగం 2026 మార్చి 26న విడుదల కానుంది.
అయితే రెండో భాగం మాత్రం ఇంకొంత ఆలస్యం అవుతుందని సమాచారం. రెండు భాగాలుగా తెరపైకి రావడం వల్ల కథను మరింత డీటెయిల్‌గా చూపించడానికి అవకాశం లభిస్తుంది. కథ మొత్తం ఒకే సినిమాలో చెప్పలేని విధంగా ఉండటంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.