
‘జబర్దస్త్’ కమెడియన్ వేణు (Venu Yeldandi).. దర్శకుడిగా మారి ‘బలగం’ (Balagam) చేశాడు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. థియేట్రికల్గా మాత్రమే కాదు, ఓటీటీలో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. టెలివిజన్ ప్రీమియర్స్ లో కూడా ఈ సినిమా మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. అలాగే సినిమాకి బోలెడన్ని అవార్డులు కూడా లభించాయి. అందుకే ‘బలగం’ వేణుతో సినిమాలు చేయడానికి హీరోలు ముందుకు వచ్చారు. దిల్ రాజు (Dil Raju) కూడా అతనితో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
Yellamma
ఆల్రెడీ వేణు వద్ద ‘ఎల్లమ్మ’ అనే కథ రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదట నాని (Nani), తేజ సజ్జ (Teja Sajja) వంటి హీరోల పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళు ఎందుకో ఈ కథని పక్కన పెట్టారు. ఫైనల్ గా నితిన్ ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి ఎల్లమ్మ అయితే ముందుకు కదిలింది అనే చెప్పాలి. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే కథే. కానీ మైథాలజీ టచ్ ఉంటుందట. ‘కాంతార’ రేంజ్ క్లైమాక్స్ కూడా డిజైన్ చేసినట్లు వినికిడి.
అయితే 2024 నవంబర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని అంతా అనుకున్నారు. దిల్ రాజు కూడా 2025 ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టాలని వేణుతో ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకో ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళదు అని అంతా అనుకున్నారు.
కానీ మార్చి నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్లో భాగంగా నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈలోగా నితిన్ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’ (Robinhood) ‘తమ్ముడు’ (Thammudu) సినిమాలు ఫినిష్ అయిపోతాయి. ఆ వెంటనే అతను ‘ఎల్లమ్మ’ (Yellamma) షూటింగ్లో జాయిన్ అవుతాడు అని స్పష్టమవుతుంది.