మరో హారర్ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రం!

మదర్‌థెరిసా ఫిల్మ్స్ ఇంటర్‌నేషనల్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. విశాల్ శర్మ, మీనాక్షి జైన్ జంటగా నటిస్తున్నారు. దర్శకనిర్మాత శ్రీనివాస్.జి. మాట్లాడుతూ "ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ మొదలుపెట్టాం. అనంతపురం, హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేస్తాం. ఓ ఘటన ఓ యువత భవిష్యత్తును ఎలా నిర్దేశించింది? దాని పర్యవసానంగా ఏం జరిగింది? అనేది ఆసక్తికరం'' అని అన్నారు. "హారర్ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రం. కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' ఎగ్జిక్యూటివ్ నిర్మాత జి.సాయిరమేష్‌గౌడ్ తెలిపారు. రెహమత్, హైమావతి, కె.శ్రీదేవి, రవిచౌదరి, చైతన్య చౌదరి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: సాయి, కథ, మాటలు: ఎం.డి.మజర్.

Tags: Film News, Telugu Cinema News, Movie News, Tollywood
Labels:

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.