‘‘నేను ఆశించిన స్థాయిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సిరిమల్లె పువ్వు విజయ తీరాన్ని చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సహకరించిన శ్రీనివాస్‌రెడ్డి, ఉమాదేవి, శ్రీధర్‌రెడ్డి, మల్టీడైమన్షన్ వాసుకి కృతజ్ఞతలు.’’ అని దర్శకుడు రామరాజు చెప్పారు. క్రాంతి, శ్రీ దివ్య జంటగా జక్కం జవహర్‌బాబు సమర్పణలో జి.ఉమాదేవి నిర్మించిన ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేసింది’’ అని సంతోషం వెలిబుచ్చారు. కథను నమ్మి సినిమా చేసినందుకు మంచి ఫలితం దక్కిందని క్రాంతి చెప్పారు. సంగీత దర్శకుడు పవన్‌కుమార్, కెమెరామేన్ బాల్‌రెడ్డి కూడా మాట్లాడారు.