‘‘మా చిత్రానికీ బాపుగారి సినిమాకీ ఎలాంటి పోలిక ఉండదు. పెళ్లయిన తర్వాత ఓ జంట ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా ప్రధానాంశం. ఈ పాయింట్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని బి.నాగిరెడ్డి అన్నారు. బి.వి. గోపాల్, పి.సుమన్‌తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘పెళ్లి పుస్తకం’. రాహుల్, నీతిటేలర్ జంటగా రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వం వహించారు. రేపు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ -‘‘ఈ వర్షాకాలంలో అందరూ హాయిగా ఆస్వాదించదగ్గ సినిమా ఇది. నా కెరీర్‌కి మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. మంచి పాత్రలు చేశామని అనిల్ కల్యాణ్, యశస్విని అన్నారు. -