ఇప్పటి కుర్రకారుకి రేవ్‌పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేవ్ పార్టీ పేరు చెప్పి వాళ్లు చేసే ఎంజాయ్ అంతా ఇంతా కాదు. ఈ ఎంజాయ్‌మెంట్ జాబితాలో పవన్‌కల్యాణ్ కూడా చేరిపోయారు. సమంత, ముంతాజ్, హంసానందిని తదితరులతో కలిసి ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అంటూ పవన్‌కల్యాణ్ రేవ్ పార్టీ జరుపుకుంటున్నారు.
అయితే అది నిజం పార్టీ అనుకునేరు. ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం రేవ్‌పార్టీ సెటప్‌తో ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా పాటలను వచ్చే వారం విడుదల చేయబోతున్నారు. సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మేం ఇప్పటి వరకూ టైటిల్ ప్రకటించకపోయినా, ‘అత్తారింటికి దారేది’ బాగా ప్రచారమైపోయింది. మా కథకు హండ్రడ్ పర్సంట్ యాప్ట్ అది.
అందుకే అధికారికంగా అదే ప్రకటిస్తున్నాం. గత నెలలో స్పెయిన్‌లో 25 రోజుల పాటు భారీ షెడ్యూలు చేసొచ్చాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో గణేష్ నృత్య దర్శకత్వంలో భారీ ఎత్తున రేవ్ పార్టీ నేప థ్యంలో పాట చిత్రీకరిస్తున్నాం. ఇందులో పవర్‌స్టార్ స్టెప్స్ అదిరిపోతాయి. దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సహనిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.