
సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు అనే చెప్పాలి. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి వంటి వారు మరణించారు. టాలీవుడ్లో అనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా మరణించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యుల్లో కూడా విషాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ దర్శకుడు కన్నుమూశాడు. కొద్దిరోజుల క్రితం మిస్ అయిన ఆ దర్శకుడు తాజాగా ఓ నది ఒడ్డున శవమై కనిపించడం అందరికీ షాకిచ్చింది. ఈ విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ‘ఇంద్రావతు ఒరు నాల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన వెట్రి దురైసామి 9 రోజుల క్రితం అంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో మిస్ అయ్యాడు.వెట్రి దురైసామి తన స్నేహితులు గోపీనాథ్, తంజిన్‌లతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు.
తర్వాత వీరి ఆచూకీ మిస్ అయ్యింది. తర్వాత తేలింది ఏంటంటే.. వారు ప్రయాణించిన కారు సట్లెజ్ నదిలో పడిపోయిందట. ఈ ప్రమాదం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు నడిపింది తంజిన్ అని విచారణలో తేలిందట. ఈ ఘటనలో గోపీనాథ్‌కు తీవ్ర గాయాలు కాగా, తంజిన్ స్పాట్‌లోనే మృతి చెందారు. అయితే దర్శకుడు వెట్రి ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇక తాజాగా ఇతను నదిలో శవమై (Vetri Duraisamy) కనిపించినట్టు సమాచారం.