March 20, 202505:05:28 PM

Pushpa2: పుష్ప2 తో ప్రాఫిట్స్.. వీళ్ళతో నష్టాలు రావుగా?

Mythri Movie Makers risk with Pushpa2 profits

తెలుగు సినిమా పరిశ్రమలో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగింది. వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకున్న ఈ సంస్థ, ‘పుష్ప 2’తో అయితే రికార్డు స్థాయిలో లాభాలు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మైత్రికి బిగ్గెస్ట్ ప్రాఫిట్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్‌లలో కూడా తమదైన ముద్ర వేయాలని ఈ సంస్థ భారీ స్కెచ్ వేసింది.

Pushpa2

Mythri Movie Makers shakes the double box office

కానీ ఈసారి మైత్రి పెట్టుబడులలో రిస్క్ ఎక్కువగానే ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సంస్థ జాట్ (Jaat) అనే హిందీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది ‘గదర్ 2’  (Gadar 2) సంచలన విజయాన్ని సాధించడంతో, అదే ఫాలో అవ్వాలని మైత్రి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ప్రొడక్షన్‌ను చేపట్టింది.

కానీ బాలీవుడ్‌లో మాస్ సినిమాలకు ఆదరణ తగ్గడం, అలాగే సన్నీ డియోల్ క్రేజ్ గదర్ 2 లెక్కల్లో కొనసాగుతుందా అనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే కాకుండా మైత్రి మరో భారీ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసింది. తమిళ స్టార్ అజిత్ కుమార్ (Ajith) ప్రధాన పాత్రలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) సినిమా కూడా ఏప్రిల్ 10న విడుదల కానుంది. అజిత్ సినిమాలు గత కొంత కాలంగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, ఈ సినిమా మైత్రికి సేఫ్ బెట్ అవుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయి.

ఓవైపు కోలీవుడ్ మార్కెట్‌ను క్యాష్ చేసుకునే ప్లాన్‌తో మైత్రి అజిత్ సినిమాను టేకప్ చేసింది. కానీ మాస్ హీరోల సినిమాలు కూడా ఇప్పుడు కంటెంట్ మిస్సయితే నష్టాలు తప్పడం లేదు. అయితే మైత్రికి ఇది సురక్షితమైన ప్రాజెక్ట్‌గా మారుతుందా అనేది సందేహాస్పదంగా మారింది. అంతేకాదు, మైత్రి ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 10న విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది వ్యాపారపరంగా ఎంత వరకు లాభదాయకమో అనే చర్చ కూడా నడుస్తోంది.

పుష్ప 2తో (Pushpa 2) వచ్చిన లాభాలను నిలబెట్టుకోవాలంటే, మైత్రి మూవీ మేకర్స్ ఈ కొత్త రిస్క్‌లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఏప్రిల్ 10 మైత్రి భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన రోజు కానుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు భారీ హిట్స్ అయితే, ఈ సంస్థ బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్‌లలోనూ తమ ప్రభావాన్ని చూపనుంది. లేకపోతే, పుష్ప 2తో వచ్చిన లాభాలను పోగొట్టుకున్న ప్రొడక్షన్ హౌస్‌గా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

గజని – తుపాకి.. ఆ కంటెంట్ ఎక్కడ మురగదాస్?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.