March 24, 202509:28:10 AM

Allu Arjun: ఆ డైరెక్టర్ కు బన్నీ నో చెప్పడం వెనుక అసలు లెక్కలు ఇవేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ (Allu Arjun) అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్ల సమయం పడుతున్న నేపథ్యంలో సినిమాల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బన్నీ అడుగులు పడుతున్నాయి. బన్నీతో పని చేయడానికి టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నుంచి కనీసం పది మంది డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బన్నీ మాత్రం పుష్ప ది రూల్ (Pushpa2) తర్వాత ఎవరికి ఛాన్స్ ఇస్తారనే ప్రశ్నకు సైతం జవాబు దొరకడం లేదు.

అయితే అట్లీ ప్రాజెక్ట్ కు బన్నీ నో చెప్పాడని తెలుస్తోంది. అట్లీ (Atlee) చెప్పిన కథ ఇంప్రెస్ చేయలేదని అందుకే బన్నీ నో చెప్పారని సమాచారం అందుతోంది. మరో కొత్త కథతో అట్లీ మెప్పిస్తే ఈ కాంబోలో సినిమా వస్తుందని అలా జరగని పక్షంలో బన్నీ మరో దర్శకుని ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్తారని తెలుస్తోంది. బన్నీ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. బన్నీ ఆలోచనలు దర్శకులను సైతం గందరగోళానికి గురి చేస్తున్నాయి.

పుష్ప ది రూల్ లో కొన్ని సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే మంచి గుర్తింపు రాగా తర్వాత సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు బన్నీ ఓటేస్తున్నారు. బన్నీ కెరీర్ ప్లానింగ్ గందరగోళంగా ఉన్నా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు బన్నీ ఖాతాలో చేరాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.