Alludugaru: రాఘవేంద్రరావు వారి మాట వినుంటే… ఏమయ్యేదో?

మోహన్‌బాబు (Mohan Babu) సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలేంటి అని ఏ సినిమా అభిమాని అడిగినా చెప్పే లిస్ట్‌లో కచ్చితంగా ఉండే సినిమా ‘అల్లుడు గారు’. అంతలా ఆ సినిమాతో ఆయన అలరించారు. నటనలోని వైవిధ్యం, అందించిన వినోదం, చూపించిన విధానం ఇలా అన్నీ అదిరిపోతాయి. అలాంటి సినిమాను ఆయన కాకుండా వేరే వాళ్లు చేసుంటే… అయ్యో అదేం ప్రశ్న. ఆయన కాబట్టే అంతబాగుంది అని మీరు అనొచ్చు. అయితే పొరపాటున అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వేరే హీరోతో ఆ సినిమా తెరకెక్కి ఉండేది.

కొన్ని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటాయి. అలాంటి వాటిలో ‘అల్లుడుగారు’ సినిమాలో విష్ణు (Manchu Vishnu) పాత్ర ఒకటి. అయితే ఆ పాత్ర వేరే నటుడికి ఇస్తే బాగుంటుంది అని ఆ సినిమా అనుకుంటున్న తొలి రోజుల్లో రాఘవేంద్రరావుకు (Raghavendra Rao) కొంతమంది సన్నిహితులు సూచించారట. కానీ ఆయన మాత్రం మోహన్‌ బాబు అయితేనే ఆ పాత్ర పండుతుంది అని నమ్మి ఆయనకే ఇచ్చి సినిమా చేసి భారీ విజయం అందుకున్నారు.

చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా అందించిన భారీ విజయంతో దర్శకుడు రాఘవేంద్రరావు క్రేజ్‌ డబుల్‌ అయ్యింది. దాంతో ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరితో చేస్తారు అనే చర్చలు పెద్ద ఎత్తున నడిచాయి. అలా ఆయన ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే రాఘవేంద్రరావు ‘అల్లుడుగారు’ సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు.

దీంతో మీ సినిమాకు వేరే పెద్ద హీరోని తీసుకోండి. మోహన్‌బాబుతో ఎందుకు తీస్తున్నారు? అని రాఘవేంద్రరావుతో కొందరు అన్నారట. వారి మాటలను పట్టించుకోకుండా రాఘవేంద్రరావు మోహన్‌బాబుతోనే ఆ సినిమాను తెరకెక్కించారు. అలా మొదలైన సినిమా భారీ విజయం అందుకుని, ఇద్దరి కెరీర్‌ బెస్ట్‌ మూవీగా మారింది.

Alludugaru Movie

ఇక ఈ సినిమా చిత్రీకరణ 32 రోజుల్లో పూర్తయిందట. అంత వేగంగా సినిమా పూర్తి చేసి ఆ కొందరిలో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసి సినిమాకు భారీ విజయాన్ని అందుకున్నారు. శోభన (Shobana), రమ్యకృష్ణ (Ramya Krishnan) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబరు 28, 1990న విడుదలైంది. మంచి వసూళ్లతో 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఆ సినిమా విజయంలో పాటల ప్రభావం చాలా ఎక్కువ ఉంది అనే మాట కచ్చితంగా చెప్పుకోవాలి.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.