March 22, 202503:01:38 AM

Anupama: టిల్లూ స్క్వేర్ లో ఆ ఇద్దరిలో ఎవరు మెప్పించారు.. నెటిజన్ల జవాబిదే!

మార్చి నెలలో థియేటర్లలో విడుదలైన టిల్లూ స్క్వేర్ మూవీ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయో రెండో రోజు కలెక్షన్లు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యి అన్ని ఏరియాలలో అదరగొడుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. టిల్లూ స్క్వేర్ (Tillu Square) లో రాధిక పాత్రలో నేహాశెట్టి (Neha Shetty)  లిల్లీ పాత్రలో అనుపమ (Anupama Parameswaran) అదరగొట్టారు.

ఇద్దరిలో ఎవరు అద్భుతంగా చేశారనే ప్రశ్నకు ఒకరిని మించి ఒకరు ఆకట్టుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఇద్దరు హీరోయిన్లు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే. టిల్లూ స్వేర్ మూవీ కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతూ ఉండటంతో టిల్లూ క్యూబ్ ను ప్రకటించేశారు.

టిల్లూ క్యూబ్ మూవీ కోసం అదిరిపోయే లైన్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ టిల్లూ స్క్వేర్ సినిమా సక్సెస్ తో మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరినట్టేనని చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ పాన్ ఇండియాలో సినిమాలను రిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఎంటర్టైన్మెంట్ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తారని నెటిజన్లు కామెంట్లు చేశారు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ఈ సినిమాను తన భుజాలపై మోశారని నెటిజన్లు వెల్లడిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో సైతం నటిస్తుండగా ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ లుక్స్ కు యూత్ ఫిదా అవుతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.