March 23, 202505:19:53 AM

Ashish: దిల్‌ రాజు ప్లాన్‌ అదిరిందిగా… కొడుకు కోసం సీక్వెల్‌ ప్లాన్‌!

శర్వానంద్‌ (Sharwanand) కెరీర్‌ మోనోక్రోమ్‌ కలర్‌లా సాదాగా సాగిపోతున్న సమయంలో (Satamanam Bhavati) ‘శతమానం భవతి’ అంటూ ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా అందించిన విజయం సంగతి పక్కనపెడితే శర్వా నటనకు, కెరీర్‌కు కొత్త రంగు ఇచ్చింది ఆ సినిమా. ఈ కారణంగానే ‘శతమానం భవతి’ సినిమా సీక్వెల్‌ వస్తోంది అని దిల్ రాజు (Dil Raju) టీమ్‌ అనౌన్స్‌ చేయగానే శర్వా ఫ్యాన్స్ భలే ఖుష్‌ అయ్యారు. పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ మినహా పెద్ద వివరాలు లేకపోయినా..

శర్వానంద్‌ పుట్టిన రోజుకైనా చెబుతారేమో అనుకున్నారు. కానీ ఆ రోజు వచ్చి వెళ్లిపోయింది వివరాలు అయితే లేవు. ఎందుకబ్బా అని ఆరా తీస్తే… ఆ సినిమా శర్వా కోసం కాదు అని తేలిపోయింది. ఆ సినిమా ఆశిష్‌ కోసం సిద్ధం చేస్తున్నారట దిల్‌ రాజు. సాధారణంగా సీక్వెల్స్ అంటే మొదటి పార్ట్ లో ఉన్నవారే కొనసాగుతారు, హీరో అయితే పక్కాగా తొలి సినిమా హీరోనే ఉంటారు. కానీ ‘శతమానం భవతి’ విషయంలో పూర్తిగా కొత్త టీమ్‌తో తెరకెక్కిస్తున్నట్లు టాక్.

Shatamanam Bhavati Movie, Hero Sharwanand, Anupama parameswaran, Actor Prakash Raj, Dil Raju,

ఆ సినిమా కాన్సెప్ట్‌, ఫ్లేవర్‌ను మాత్రమే సీక్వెల్‌కి తీసుకెళ్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభమవుతుందట. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దగ్గర పని చేసిన హరి అనే కొత్త దర్శకుడు ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ సినిమాతో అరంగేట్రం చేస్తారట. శర్వానంద్ ప్లేస్‌లో దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి నటిస్తాడట.

దిల్ రాజు ప్రొడక్షన్‌లో ‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన (Ashish) ఆశిష్… ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవానా హీరోయిన్‌గా ‘సెల్ఫిష్‌’ అనే సినిమా ఉంది. అలాగే ‘లవ్‍ మీ – ఇఫ్ యూ డేర్’ అంటూ వైష్ణవి చైతన్యతో చేస్తున్నాడు. ఈ లెక్కన మూడు సినిమాలతో ఈ ఏడాదిలో ఆశిష్‌ సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాలు కూడా తొలి సినిమాలాగా మంచి పేరు తెచ్చుకుంటే యంగ్‌ స్టార్‌ హీరోల జాబితాలోకి వచ్చేస్తాడు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.