Ayesha Khan : అయేషా ఖాన్.. అనుకున్నది ఒకటి.. అవుతుంది ఇంకొకటి..!

ముంబై బ్యూటీ ఆయేషా ఖాన్(Ayesha Khan) .. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఏడాది దాటింది.2022 లో వచ్చిన ‘ముఖచిత్రం’ (MukhaChitram) సినిమాతో ఈమె టాలీవుడ్ కి పరిచయమైంది. అందులో ఈమె కనిపించేది కాసేపే అయినా.. తన గ్లామర్ తో కట్టిపడేసింది అని చెప్పాలి. అలాగే ఆ సినిమాలో ఓ సీన్ కోసం అయేషా చాలా రిస్క్ చేసింది. అందులో బైక్ యాక్సిడెంట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరిస్తూ ఉండగా ఆమె ప్రమాదవశాత్తు నిజంగానే పడిపోయింది.

పెద్దగా బరువు లేకపోవడం వల్ల ఆమె త్వరగానే కోలుకుంది అని ఆ టైంలో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ముఖచిత్రం’ తర్వాత వెంటనే ఈమెకు ఛాన్సులు లభించలేదు.2023 లో ఈమె నటించిన ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ లో (Om Bheem Bush) ఈమె నటించింది. ఈ సినిమాలో ప్రియదర్శికి (Priyadarshi)  జోడీగా ఆమె కనిపించింది. ట్రైలర్లో ఈమెనే హైలెట్ అయిన సంగతి తెలిసిందే.

మరోపక్క విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా తెరకెక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమాలో కూడా ఈమె నటించింది. అలాగే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ లో కూడా నటించింది. అయితే అయేషాకు మెయిన్ లీడ్ గా సరైన పాత్రలు రావడం లేదు అనేది వాస్తవం. ఆమె లుక్స్ చాలా బాగుంటాయి. మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగల నటి కూడా..! కానీ ఎందుకో మేకర్స్ ఈమెకు మూలన పడేసే పాత్రలు, డాన్స్ నంబర్స్ కి మాత్రమే తీసుకుంటున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.