March 20, 202511:57:10 PM

Balakrishna: ఆ పండుగ రోజున ఫ్యాన్స్ కు బాలయ్య తీపికబురు.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో నందమూరి బాలయ్యకు (Nandamuri Balakrishna) తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలయ్య 109 మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా ఉగాది పండుగ కానుకగా బాలయ్య 110 మూవీ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ నెల 9వ తేదీన బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోను అధికారికంగా ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా అఖండకు (Akhanda) సీక్వెల్ గా తెరకెక్కుతుందా? లేక మరో కొత్త కథాంశంతో తెరకెక్కుతుందా? అనే ప్రశ్నలకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే అఖండ1 సినిమాకు (Miryala Ravinder Reddy) మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత కావడంతో ఆయన అఖండ2 సినిమాను మరో బ్యానర్ లో నిర్మించడానికి అనుమతులు ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. స్కంద సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో తర్వాత సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన బాధ్యత బోయపాటి శ్రీనుపై ఉంది. బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కాగా ఈ కాంబో మూవీ ఎంత బడ్జెట్ తో తెరకెక్కినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంది. బాలయ్య 109 మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా షైన్ టామ్ చాకో ఈ సినిమాలో ఒక విలన్ గా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య, (Shine Tom Chacko) షైన్ టామ్ చాకో కాంబో వెరైటీ కాంబో అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

షైన్ టామ్ చాకో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. బాలయ్య భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఉగాది పండుగ రోజున బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. బాలయ్య రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.