Bhimaa First Review: ‘భీమా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

గోపీచంద్ కి (Gopichand) ఈ మధ్య హిట్లు లేవు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన (Ramabanam) ‘రామబాణం’ కూడా నిరాశపరిచింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని కన్నడ టాప్ డైరెక్టర్ ఎ.హర్ష తో (Bhimaa) ‘భీమా’ అనే సినిమా చేశాడు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar).. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

గతంలో ఇదే బ్యానర్లో (Pantham) ‘పంతం’ అనే సినిమా చేశాడు గోపీచంద్. అది అతనికి ల్యాండ్ మార్క్ మూవీ. అంటే 25 వ సినిమా అనమాట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అది సక్సెస్ కాలేదు. యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ ‘భీమా’ సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకి స్పెషల్ షో వేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం..

‘భీమా’ ఫస్ట్ హాఫ్ లో కామెడీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. ఇంటర్వెల్ బ్లాక్ పర్వాలేదు అంటున్నారు. సెకండ్ హాఫ్ రొటీన్ గా ఉన్నప్పటికీ.. ఒక ట్విస్ట్ అలరించే విధంగా ఉంటుందట. క్లైమాక్స్ పోర్షన్లో వి.ఎఫ్.ఎక్స్ బాగున్నాయి అని అంటున్నారు. మొత్తంగా ‘భీమా’.. ఈ మధ్య కాలంలో వచ్చిన గోపీచంద్ సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.