March 20, 202509:51:40 PM

ఆకట్టుకుంటోన్న ‘కలియుగం పట్టణంలో’ నుంచి ‘నీ వలనే’ పాట

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు.

రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల చేసిన మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచారు. ఈక్రమంలోనే చిత్రం నుంచి మంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నీ వలనే’ అంటూ సాగే ఈ మెలోడి పాటను ఎం.ఎం.మానసీ ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. అజయ్ అరసాద అందించిన చక్కటి బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ చిత్రాన్ని మార్చి 22న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.