గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- పుట్టినరోజు సందర్భంగా ‘మగధీర’ రీ-రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మెగా బ్లాక్ బస్టర్ “మగధీర” చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.

ఈ సందర్భంగా పంపిణీదారులు శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.