Chandini Chowdary: ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు: చాందిని

‘గామి’ అనే ఓ సినిమా టాలీవుడ్‌లో తెరకెక్కుతోంది అనే విషయమే చాలా మందికి మొన్నటివరకు తెలియదు. ఎందుకంటే ఆ సినిమా గురించి ఎక్కడా పెద్దగా సమాచారం లేకుండా షూటింగ్‌ చేశారు. ఏదో రెగ్యులర్‌ సినిమాలే అని అనుకుంటుండగా… ప్రమోషనల్‌ వీడియోస్‌తో ‘ఈ సినిమా మూమలు సినిమా కాదు’ అనేలా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన చాందిని చౌదరి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొన్ని కథలు విన్నప్పుడు తమను తాము నియంత్రించుకోలేని పరిస్థితి వస్తుంది. ‘గామి’ సినిమా కథ విన్నప్పుడు తనకు అలాంటి అనుభూతే కలిగిందట. అందుకే ఈ సినిమాలో కచ్చితంగా చేయాలని ఫిక్స్‌ అయ్యిందట. విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాను విద్యాధర్‌ కాగిత తెరకెక్కించారు. ఈ నెల 8న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను కథ అవసరం రీత్యా విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో తెరకెక్కించారు. దీని వల్లే చిత్రీకరణకు చాలా సమయం పట్టింది.

ఈ సినిమా క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుందని, నాకు తెలిసి ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదని చాందిని అంటోంది. ఈ సినిమా విజయం సాధిస్తే.. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు తెరపైకి వస్తాయని నమ్మకంగా చెబుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ అంతా సాహస యాత్రలా జరిగిందని నాటి రోజులు గుర్తు చేసుకుంది. వారణాసి, కశ్మీర్‌, హిమాలయాలు, కుంభమేళలో అఘోరాల మధ్య… చిత్రీకరణ జరిపారట. హిమాలయాల్లో షూటింగ్‌ జరుపుతున్నప్పుడు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారట.

ఒకే బస్సులో అందరూ హిమాలయాలకు వెళ్లి సూర్యాస్తమయం వరకు చిత్రీకరణ చేసి వచ్చే వాళ్లట. అక్కడ వాష్‌ రూమ్స్‌ ఉండవు కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు నీళ్లు తాగేవాళ్లు కాదట. అలా నెల రోజులు అక్కడ షూటింగ్‌ చేశారట. గడ్డ కట్టిన నదిపై చిత్రీకరణ జరుపుతున్నప్పుడు మంచు ఫలకాల మధ్య పగుళ్లు ఏర్పడి నదిలో పడే పరిస్థితి ఎదురైందట. ఆ సమయంలో తన దగ్గర ఉన్న లగేజ్‌ను దూరంగా విసిరేసి… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకు దూకాను అని చాందిని (Chandini Chowdary) చెప్పింది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.