Eagle: ఈగల్ మూవీకి పరుచూరి రివ్యూ.. అలా చేసి ఉంటే రిజల్ట్ మారేదంటూ?

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ (Eagle) మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈగల్ సినిమా గురించి తాజాగా  (Paruchuri Gopala Krishna) పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను పంచుకోగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయంలో మహిళా ప్రేక్షకులు, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు వేర్వేరుగా ఉంటాయని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈగల్ మూవీలో మాస్ ప్రేక్షకులను తల తిప్పుకోకుండా చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమాలో పత్తి రైతుల సమస్యలను టచ్ చేశారని నేను ముందుగా హీరో రైతు అని భావించానని పరుచూరి వెల్లడించారు. ఈ సినిమాలో మారణాయుధాల మాఫియాను ప్రధానంగా తీసుకున్నారని పరుచూరి కామెంట్లు చేశారు. ఈ సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్ గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో కథ, కథనాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని పరుచూరి పేర్కొన్నారు.

ఈగల్ కథ ప్రేక్షకులకు బాగా కానెక్ట్ కావడానికి దర్శకుడు (Karthik Ghattamaneni) చాలా కష్టపడ్డాడని ఆయన వెల్లడించారు. నవదీప్ (Navadeep) రోల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని పరుచూరి తెలిపారు. కామెడీ, లవ్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటాయని ఈ రెండూ లేకుండా డైరెక్టర్ సినిమాను తెరకెక్కించి సాహసం చేశాడని ఆయన అన్నారు. సినిమాలో తుపాకీ కాల్పుల నేపథ్యంలో ఎక్కువ సీన్స్ ఉన్నాయని వాటిని తగ్గించాల్సిందని మాస్ కు ఎంటర్టైన్మెంట్ కావాలని పరుచూరి చెప్పుకొచ్చారు.

యూత్ కు ప్రేమ కావాలనే విషయాన్ని ఈతరం డైరెక్టర్లు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా కథనం ఉంటే సినిమాకు రెట్టింపు ఫలితం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈగల్ సినిమా కథ, కథనంలో కొన్ని పొరపాట్లు జరిగాయని అవి జరగకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.