Harish Shankar: చిరుతో సినిమా అంటే… పవన్‌ సినిమా లేటు అనేగా?

ఓ సినిమా సెట్‌ మీద ఉండగానే… తర్వాత సినిమా కోసం ప్లాన్‌ చేసుకోడం కొత్తేమీ కాదు. సినిమా సినిమాకు గ్యాప్‌ ఎక్కువగా ఉండకూడదు అంటే ఈ ప్లాన్‌ చేసుకోవాలి. అలా ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)  కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారు. ఓ సినిమా సుదీర్ఘ కాలం హోల్డ్‌లో పెట్టేసరికి, మరో సినిమా ఓకే చేసుకుని బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ సినిమా ఇంకా సగం అవ్వలేదు మరో సినిమాను దాదాపు ఓకే చేయించుకున్నారు. అయితే మొదటి సినిమా, మూడో సినిమా మధ్య క్లాష్‌ వస్తుందేమో అనే డౌట్స్‌ క్రియేట్‌ అవుతున్నాయి.

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) అనే సినిమా ఓకే చేయించుకుని చాలా నెలలుగా వెయిటింగ్‌లో ఉన్నారు హరీశ్‌ శంకర్‌. (Pawan Kalyan) పవన్‌ కల్యాణ్‌ రెండు పడవల ప్రయాణమే అందుకు కారణం. అయితే పవన్‌ ఇప్పుడు లాంగ్‌ గ్యాప్‌ ఇవ్వడంతో ఇంకా ఆ సినిమా దగ్గరే ఉంటే టైమ్‌ వేస్తే అని రవితేజతో (Ravi Teja) ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ఓకే చేయించుకుని ఇప్పుడు సెట్స్‌ మీద ఉన్నారు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే చిరంజీవితో (Chiranjeevi) సినిమా ఓకే చేయించుకున్నారని టాక్‌. పీపుల్‌ మీడియా, సుస్మిత కొణిదెల (Sushmita Konidela) ఈ సినిమా నిర్మాతలు.

గతంలో పూరి జగన్నాథ్‌ చేస్తానని చెప్పిన ‘ఆటో జానీ’ కథనే తన స్టైల్‌లో సిద్ధం చేసి చిరుకి చెప్పి ఓకే చేయించుకున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ‘మిస్టర్ బచ్చన్‌’ అవ్వగానే హరీశ్‌ ఏ సినిమా స్టార్ట్‌ చేస్తారనేదే ఇక్కడ ప్రశ్న. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చేస్తారా? లేక చిరు సినిమా చేస్తారా అనేది చూడాలి. పవన్‌ డేట్స్‌ ఇచ్చే బట్టే హరీశ్‌ శంకర్‌ సినిమా ఉంటుంది అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్‌ తిరిగి సినిమాల్లోకి వచ్చి తొలుత ‘ఓజీ’కి (OG Movie) డేట్స్‌ ఇస్తారు అంటున్నారు. ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu) , ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఉంటాయి అంటున్నారు. ఈ ఆర్డర్‌ బట్టే చిరు – హరీశ్‌ శంకర్‌ సినిమా సంగతి తేలుతుంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.