Havya Vahini: ఘనంగా వెంకటేశ్‌ చిన్న కూతురి వివాహం.. ఫొటోలు వైరల్‌!

ప్రముఖ కథానాయకుడు, విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయ వాహిని శుక్రవారం ఓ ఇంటి కోడలైంది. విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తనయుడు నిశాంత్ పాతూరితో ఆమె ఏడు అడుగులు వేసింది. రామానాయుడు స్టూడియోలో ఈ మేరకు బంధుమిత్రులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హయ వాహిని ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతున్నాయి.

వివాహం తర్వాత హయ వాహిని (Havya Vahini), నిశాంత్ పాతూరితో వెంకటేష్, నీరజ దంపతులు దిగిన ఫొటోలను దగ్గుబాటి కుటుంబం మీడియాకు విడుదల చేసింది. అంతకుముందు మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో మహేష్ బాబు (Mahesh Babu) సతీమణి నమ్రత (Namrata Shirodkar), కుమార్తె సితార సందడి చేశారు. దీంతో మరికొద్ది మంది సన్నిహితులు కూడా ఆ ఫొటోల్లో కనిపించారు. పెళ్లి రిసెప్షన్ కూడా ఉందని అంటున్నారు.

వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె ఆశ్రితకు 2019లో వివాహం చేశారు. ప్రస్తుతం ఆశ్రిత కుటుంబం విదేశాల్లో ఉంటోంది. రెండో కుమార్తె హయ వాహిని వివాహం ఇప్పుడు జరిగింది. గతేడాది అక్టోబరు నెలలో నిషాంత్‌, హయ వాహిని నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు చిరంజీవి(Chiranjeevi), మహేశ్‌ బాబు, రానా(Rana) , నాగచైతన్య (Naga Chaitanya) తదితరులు హాజరయ్యారు. ఇక వీరికి ఆఖరి అమ్మాయి భావన, కుమారుడు అర్జున్ ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి ‘సైంధవ్’ (Saindhav) సినిమాతో థియేటర్లలో సందడి చేయాలనుకున్నారు వెంకీ. అయితే ఆశించిన విజయం అందుకోలేదు. త్వరలో ‘రానా నాయుడు 2’ (Rana Naidu2) వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్‌ చేస్తున్నారట. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) – దిల్‌ రాజు (Dil Raju) కాంబినేషన్‌లో కొత్త సినిమా ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు పరిశీలిస్తున్నారట. ఇవి కాకుండా మరో రెండు మూడు కథలు చర్చల దశలో ఉన్నాయట. ఈ విషయంలోనూ త్వరలో స్పష్టత వస్తుందని చెప్పొచ్చు.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.