Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం గూస్‌బంప్స్‌ లుక్‌లో రామ్‌చరణ్‌… ఎక్కడంటే?

రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త సినిమా గురించి ఎంత మంది వెయిట్‌ చేస్తున్నారు… అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఈ లిస్ట్‌లో ఉంటారు. ఈ క్రమంలో సినిమా నుండి ఓ లీక్‌ వస్తే ఆ ఫీలే వేరు కదా. మామూలుగా అయితే ఇలాంటి లీకులను మనం ఎంటర్‌టైన్‌ చేయకూడదు. కానీ ఫ్యాన్స్‌ అయితే రామ్‌చరణ్‌ కొత్త లుక్స్‌ చూసి వావ్‌ అంటూ మురిసిపోతున్నారు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ వద్ద సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ లోకేషన్‌ నుండే ఈ వీడియో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

చరణ్‌ అల్ట్రా ఉబర్‌ లుక్‌లో అదిరిపోయేలా కనిపిచేసరికి సోషల్‌ మీడియాలో ఇదే ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. శంకర్‌ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బజ్‌ ఉంది. ఏడాది క్రితమే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా చిత్రీకరణ మాత్రం స్లోగా సాగుతోంది. అయితే అప్పుడప్పుడు షూటింగ్‌ జరుగుతూ, ఎప్పుడో ఓసారి వచ్చే అప్‌డేట్లతో అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే లీకులు మాత్రం వాళ్లను ఖుషీ చేస్తున్నారు. అలా వచ్చిందే కొత్త లీకు.

గతేడాది తూర్పు గోదావరి జిల్లాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా ఇలా కొన్ని లుక్స్‌ బయటకు వచ్చాయి. అవి కాస్త పాత లుక్‌లో కనిపించాడు. చరణ్‌ పంచకట్టులో సైకిల్‌ తొక్కుతున్న వీడియో బయటకు వచ్చింది. అంటే అవి ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ అనుకోవచ్చు. ఇప్పుడు విశాఖపట్నం నుండి లీక్‌ అయిన ఫొటోలు చూస్తే ప్రజెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్‌ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. అందులోని ఓ లుక్‌ ఇదన్నమాట.

దిల్‌ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమా వాళ్ల బ్యానర్‌లో 50వ సినిమా. దీంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ లేదు. చరణ్‌ పుట్టిన రోజు అయిన మార్చి 27న ఈ సినిమా నుండి ‘జరగండి..’ అనే పాట రిలీజ్‌ చేస్తున్నారు. ఆ రోజు రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.