March 17, 202503:24:24 AM

Kamal Haasan: కమల్‌ హాసన్‌ – మణిరత్నం సినిమాకు వరుస షాక్‌లు.. ఇప్పుడు మరొకరు!

కొన్ని సినిమాల గురించి, కొన్ని కాంబినేషన్ల గురించి ప్రేక్షకులు ఎన్ని ఏళ్లు వేచి చూసినా తప్పు లేదు అనిపిస్తుంటుంది. అలాంటి సినిమాల్లో ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) ఒకటి. అలాంటి కాంబినేషన్లలో ఈ సినిమా ప్రధాన కాస్ట్‌ అండ్‌ క్రూ ఒకటి. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం కలిసిన ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ కలసి పని చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అనుకోని కష్టాలు వస్తున్నాయి.

అంతా బాగానే ఉంది అని అనిపిస్తున్నా.. సినిమా నుండి మెయిన్‌ కాస్టింగ్‌ తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. చాలా ఏళ్లు సరైన హిట్ లేకుండా ఇబ్బందిపడిన కమల్ హాసన్‌కి ‘విక్రమ్’ (Vikram) సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ సినిమా తర్వాత కమల్ జోరు పెంచారు. వరుసగా మూడు ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ప్రభాస్‌ (Prabhas) – నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ‘కల్కి 2898 AD’(Kalki), శంకర్‌ (Shankar) ‘ఇండియన్ 2’ (Indian2) అందులో రెండు కాగా, మూడో సినిమా మణిరత్నం ‘థగ్ లైఫ్’. ఈ భారీ బడ్జెట్‌ సినిమాను భారీగానే అనౌన్స్‌ చేశారు.

త్రిష (Trisha) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , జయం రవి (Jayam Ravi) ఈ ప్రాజెక్టులో భాగమని ప్రకటించారు కూడా. అయితే మొన్నీ మధ్య దుల్కర్‌ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నాడు అని వార్త వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి జయం రవి వైదొలగినట్లు సమాచారం. డేట్స్ విషయంలో క్లాష్‌ రావడంతో జయం రవి తప్పుకున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంలో టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

మార్చి చివరి నాటికి ‘థగ్ లైఫ్’ కోసం జయం రవి డేట్స్ ఇచ్చారట. కమల్ షూటింగ్‌కి ఆ టైమ్‌కి అందుబాటులోకి రాకపోవడంతో సినిమా ఆగింది. దీంతో మరోసారి డేట్స్ అడ్జస్ట్ చేయలేక జయం రవి తప్పుకున్నట్లు సమాచారం. దుల్కర్‌ స్థానంలో శింబును తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందని టాక్‌. అలానే ఇప్పుడు జయం రవి ప్లేస్‌లో మరొకరిని చూస్తున్నారట. మరి ఎవరు అనేది త్వరలో అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.