Tripti Dimri: ‘యానిమల్’ బ్యూటీ పై కన్నేసిన నటుడు…!

‘యానిమల్’ (Animal) సినిమా గతేడాది అంటే 2023 డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) క్యారెక్టరైజేషన్ కొంతమందికి బాగా నచ్చింది. ఇంకొంతమంది అయితే ‘అర్జున్ రెడ్డి'(Arjun Reddy) తరహాలోనే ఉంది అన్నారు. రష్మిక (Rashmika) పాత్రతో చేయించిన ఇంటిమేట్ సీన్లు కూడా పెద్ద షాకిచ్చాయి. అయితే ఆమె కంటే కూడా ‘యానిమల్’ సినిమాతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది తృప్తి దిమ్రి.

రణబీర్ కపూర్ కి ఈమెకు మధ్య వచ్చే బెడ్ రూమ్ సీన్స్ యూత్ ను మైండ్ బ్లాక్ చేసాయి అని చెప్పాలి. ఇక ఇదే సినిమాలో నటించిన సిద్దాంత్ కర్నిక్ అదే రణబీర్ కపూర్ బావ పాత్ర చేసిన నటుడు. అతను తాజాగా తృప్తి దిమ్రి (Tripti Dimri) పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సిద్దాంత్ కర్నిక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తృప్తి దిమ్రితో డేటింగ్ చేయాలని ఉంది. సినిమాలో ఆమె నా బావమరిదికి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది.

అలా చూస్తే వరుస వేరుగా ఉంటుంది. కానీ రీల్ లైఫ్ ను రియల్ లైఫ్ ని వేరుగా చూడాల్సిన అవసరం ఉంది’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టాడు. సిద్దాంత్ కర్నిక్ కామెంట్స్ పెద్ద డిస్కషన్ కే దారి తీశాయి. ఒకవేళ ‘వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అందుకే సిద్దాంత్ కర్నిక్ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడా?’ అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.