Karthik Gattamneni: ఒక బ్లాక్‌బస్టర్‌… ఒక డిజాస్టర్‌… మొత్తం ప్లాన్స్‌ మార్చేశాయా?

(Hanu Man) ‘హను – మాన్‌’ సినిమాతో ఓవర్‌ నైట్‌ పాన్‌ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు (Teja Sajja) తేజ సజ్జా. అదంతా సినిమా పరంగా వచ్చిన గుర్తింపే అయినా, కొత్త సినిమాకు బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు పెద్ద హీరోతో సినిమా చేసి… హ్యాండిల్‌ చేసే విషయంలో ఇబ్బందిపడ్డారు (Karthik Gattamneni) కార్తిక్‌ ఘట్టమనేని. (Eagle) ‘ఈగల్‌’ సినిమాలో (Ravi Teja) రవితేజకు ఇచ్చిన ఎలివేషన్లు, యాక్షన్‌ సీన్లు బాగున్నాయనే పేరొచ్చినా… అవి సినిమా విజయానికి సరిపోలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారు.

అంతా ఓకే ‘ఈగల్‌’ సినిమా వచ్చాక కొత్త సినిమా ప్రారంభించేద్దాం అని తేజ సజ్జా, కార్తిక్‌ ఘట్టమనేని అనుకున్నారు. ఇందులో మరో హీరోగా (Dulquer Salmaan) దుల్కర్‌ సల్మాన్‌ అని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ను పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చేసేశారు. అయితే ‘హను – మాన్‌’, ‘ఈగల్‌’ పరాజయం మొత్తం ప్రాజెక్టును మార్చేస్తోది అంటున్నారు. ‘మిరాయ్‌’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను ‘హ‌ను మాన్‌’ విడుద‌ల కంటే ముందు ఓకే చేసేశారు. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా కాస్టింగ్ కూడా కుదిరింది. ఈ సినిమాలో మంచు మ‌నోజ్ విలన్‌గా నటిస్తున్నాడని టాక్‌.

ఈ మేరకు కొన్ని సీన్స్‌ కూడా తీశారు అని అంటున్నారు. అయితే గత చిత్రాల ఫలితాల వల్ల హీరో, దర్శకుడు ఆలోచనలు మారాయి అంటున్నారు. సినిమాకు కొన్ని రిపేర్లు అవసరం అని రంగంలోకి దిగారు అని చెబుతున్నారు. రీ రైట్ కోసం టీమ్‌ మరోసారి కూర్చుంది అని చెబుతున్నారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త బలంగా సన్నివేశాలు రాసుకుంటున్నారు అని టాక్‌. అయితే మరి పాత సీన్స్‌ ఏం చేస్తారు అనేది చూడాఇల.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఇప్పటికే మొదలవ్వాలి. అయితే ఈ రీరైటింగ్‌, మార్పుల వల్లే సినిమా ఆలస్యం అవుతోంది అని చెబుతున్నారు. మరి ఎప్పటికి పూర్తి చేసి సిద్ధం చేస్తారో ఊడాలి.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.