April 2, 202503:00:48 AM

Manjummel Boys: రూ. 200 కోట్ల సినిమా ఎంట్రీకి డేట్‌ ఫిక్స్‌… మూడు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌లు కలసి!

మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డు వసూళ్లతో రూ. 200 కోట్లు అందుకున్న సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ రాబోతోంది. అక్కడ రూ. 200 కోట్ల సినిమా అంటే.. అది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys) అని ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆ ఫీట్‌ సాధించిన ఏకైక సినిమా అదే కాబట్టి. ఫిబ్రవరి 22న తొలుత కేరళలో థియేటర్లలో విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మెల్లగా పక్క రాష్ట్రాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసింది.

దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ తీసుకు రావాలని డిమాండ్లు పెరిగాయి. ఇదిగో అదిగో అని ఆ మధ్య వినిపించినా… అవ్వలేదు. అయితే ఎట్టకేలకు ముగ్గురు పెద్ద నిర్మాతలు కలసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. అవును తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌(Sukumar) , ‘హను – మాన్‌’ (Hanu Man) నిర్మాత నిరంజన్‌ రెడ్డి కలసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఏప్రిల్‌ 6న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.

దీంతో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), – మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)  – పరశురామ్‌ (Parasuram) – దిల్‌ రాజుల (Dil Raju) సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’కి (Family Star) సరైన పోటీ లేదు అనుకుంటున్న తరుణంలో మేమున్నాం అంటూ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ వచ్చేస్తున్నారు. అయితే కొందరు ఈ పోటీని దిల్‌ రాజు  వర్సెస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ అని కూడా అంటున్నారు. 2006లో జరిగిన యదార్థ సంఘటన నుండి ప్రేరణ పొంది ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కింఆరు. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వం వహించారు.

కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు తమిళనాడులోని కొడైకెనాల్‌ ట్రిప్‌ వేస్తారు. అక్కడి ‘గుణ’ సినిమా కేవ్స్ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అవుతారు. అది నిషేధిత ప్రాంతమని చెప్పినా వినిపించుకోకుండా వెళ్తారు. ఆ గ్యాంగ్ లో ఓ సభ్యుడు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. అతనిని కాపాడుకోవడానికి ఆ కుర్రాళ్లు ఏం చేశారు అనేద కథ.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.