Mrunal Thakur: మృణాల్‌ లైనప్‌లో రెండు సినిమాలు… ఓకే అయితే ఆపేవాళ్లే లేరు!

టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌ ఎప్పుడు వస్తుందో ఎలా చెప్పలేమో, ఏ కథానాయిక ఎప్పుడు స్టార్‌ స్టేటస్‌ దక్కించుకుంటుందో అలానే చెప్పలేం. చిన్న హీరో సినిమా చేసినా… అందులో పాత్ర చిత్రణ, చూపించిన నటనతో స్టార్‌ స్టేటస్‌కు రెడీ అయిపోవచ్చు. అలా ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌స్టార్‌ అయిపోయిన కథానాయిక (Mrunal Thakur) మృణాల్‌ ఠాకూర్‌. అప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయినా (Sitaramam) ‘సీతారామం’తో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత కొంతమందిలా వచ్చిన సినిమాలన్నీ చేసేయకుండా… జాగ్రత్తగా ఎంచుకుంటోంది.

అలా అని సినిమాలు ఎంపిక చేయడంలో గ్యాప్‌ తీసుకోలేదు. ఆ సినిమాతో మృణాల్ నటించిన (Hi Nanna) ‘హాయ్‌ నాన్న’లో పాత్రకు మంచి పేరే వచ్చింది. ఇప్పుడు (Family Star) ‘ఫ్యామిలీ స్టార్‌’లో పాత్రకు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది అంటున్నారు. ఈ సినిమా వచ్చాక మృణాల్‌ బిజీ అయిపోవడం పక్కా అని కొందరు అంటుంటే… ఆ సంగతేమో కానీ ఇప్పుడు చర్చలు జరుగుతున్న రెండు సినిమాలు వస్తే మృణాల్‌ ఆపడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ పాత్రలు అలాంటివి, ఆ సినిమా అంతటి పెద్దవి కాబట్టి.

హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా ఓ సినిమా ప్రారంభమవుతుంది అనే వార్త ఒకటి ఇటీవల కాలంలో టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ని కథానాయికగా ఎంపిక చేశారు అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందట. ఇందులో ఆమె పాత్ర ‘సీతారామం’లో సీత కంటే బాగుంటుంది అని చెబుతున్నారు. ఇక చిరంజీవి (Megastar Chiranjeevi) ‘విశ్వంభర’లో (Vishwambhara)  కూడా మృణాల్‌ను అడిగారు అని అంటున్నారు. అందులో అతిలోక సుందరి తరహా పాత్ర అంటున్నారు.

దీంతో ఈ రెండు పాత్రలు ఆమె దగ్గరకు నిజంగానే వచ్చి, ఆమె ఓకే చేస్తే ఇక కెరీర్‌లో తిరుగుండదు అని చెబుతున్నారు. ఆ దెబ్బకు మొత్తంగా బాలీవుడ్‌ ఆశలు వదులుకుని ఆమె టాలీవుడ్‌కిపూర్తిగా షిఫ్ట్‌ అయిపోవచ్చు అనేది విశ్లేషకుల మాట. మరి నిజంగానే మృణాల్‌… అల్లు అరవింద్‌ చెప్పినట్లు ఇక్కడకు వచ్చేస్తుందా?

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.