March 22, 202508:49:57 AM

Nihar Kapoor, Jayasudha: అమ్మ ఏమంటుందో అని వెయిట్‌ చేస్తున్నా: నిహార్‌ కపూర్‌

టాలీవుడ్‌లో మరో వారసుడు వస్తున్నాడు. అయితే హీరో వైపు నుండి కాదు.. హీరోయిన్‌ నుండి. కారణం అయితే తెలియదు కానీ వారసుడు ఎంట్రీ అనేంత ప్రచారం అయితే లేదు. ఎప్పుడో పూర్తయిపోయిన ఈ సినిమా వాయిదాలు పడుతూ పడుతూ ఇప్పుడు రిలీజ్‌కు సర్వం సిద్ధం చేసుకుంది. మార్చి 8న విడుదల కాబోతున్న ‘రికార్డు బ్రేక్‌’ సినిమా హీరో నిహార్‌ కపూర్‌ గురించే ఇదంతా. హంక్‌ లుక్‌లో కనిపించే ఆ హీరో ఎవరో కాదు సహజ నటి జయసుధ తనయుడే. సినిమా గురించి చెప్పే క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర అంశాలు, వ్యాఖ్యలు చేశారు.

ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా ‘రికార్డ్‌ బ్రేక్‌’ అంటూ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం విడుదల సందర్భంగా నిహార్‌ కపూర్‌ మీడియాతో మాట్లాడారు. చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘రికార్డ్‌ బ్రేక్‌’ సినిమాను చదలవాడ పద్మావతి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కేవలం తెలుగు వారికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని చెప్పారు నిహార్‌ కపూర్‌.

‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ సినిమాలో కీలక పాత్రతో (Nihar Kapoor) నిహార్‌ కెమెరా ముందుకొచ్చారు. ఇప్పుడు ‘రికార్డ్‌ బ్రేక్‌’లో హీరోగా నటించారు. ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ సినిమా సమయంలోనే చదలవాడ శ్రీనివాసరావు ఈ కథ వినిపించారట. ఇద్దరు కవలలు అనాథలుగా అడవిలో పెరుగుతారు. అక్కడే కుస్తీ నేర్చుకుని సిటీకి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో WWE పోటీల దాకా వెళ్తారు. ఈ ప్రయాణాన్ని భావోద్వేగభరితంగా సినిమాలో చూపించారట.

ఈ సినిమా పూర్తిగా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుందని, ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ కొత్తగా ఉంటుందంటున్నారు ఆయన. ఆ సన్నివేశాలే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. సినిమా ట్రైలర్‌ అమ్మ జయసుధకు చాలా నచ్చిందని, సినిమా చూశాక ఏం చెబుతుందో నని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందని చెప్పారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాను అని కూడా తెలిపారు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.