
‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు(Sree Vishnu), ప్రియదర్శి(Priyadarshi) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కలిసి నటించిన సినిమా ‘ఓం భీమ్ బుష్'(Om Bheem Bush). ‘హుషారు’ (Husharu) ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) ఈ చిత్రానికి దర్శకుడు. ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి నిర్మించిన ఈ సినిమాని ‘యువి క్రియేషన్స్’ సంస్థ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్.. సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పై క్లారిటీ ఇచ్చాయి. మార్చి 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఆల్రెడీ ‘ఓం భీమ్ బుష్’ ని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక.. తమ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్స్ బోర్ కొడుతుందట. తర్వాత ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ పర్వాలేదు అనిపిస్తుంది అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో కామెడీ ఉన్నా .. కథలో పెద్దగా డెప్త్ లేకపోవడం వల్ల పడుతూ లేస్తూ.. సాగిన ఫీలింగ్ కలుగుతుంది అని అంతా అంటున్నారు.
ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ ఓకే అనిపిస్తాయని..! మొత్తంగా కామెడీ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులకు ‘ఓం భీమ్ బుష్’ టైం పాస్ చేయిస్తుంది అని అంతా అంటున్నారు. ఓ పక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండటంతో.. థియేటర్లు డల్ గా ఉంటున్నాయి. ఇలాంటి టైంలో రిలీజ్ కాబోతున్న ‘ఓం భీమ్ బుష్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది? శ్రీవిష్ణుకి మరో హిట్ ను అందిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?