March 16, 202509:33:18 AM

Prabhas: ప్రభాస్‌ కటౌట్‌కి సరిగ్గా సరిపోయేలా విలన్‌… సెట్‌ అయిపోయాడా?

ఓ దర్శకుడు బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇచ్చాక… తర్వాత సినిమా ఇంకాస్త పెద్ద బ్లాక్‌బస్టర్‌ అడుగుతుంటారు ప్రేక్షకులు. ఇది హీరో విషయంలో ఉండదా అంటే… అది ఇన్‌బిల్ట్‌ ప్రశ్న. దర్శకుడు అయితేనే గతంలో చేసిన సినిమాకు మించి కావాలని అడగడం అలవాటు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నకు బాగా దగ్గరగా ఉన్న దర్శకుల్లో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు. ‘యానిమల్‌’ (Animal) సినిమాతో పాన్‌ ఇండియా దర్శకుడు అయిపోయిన ఆయన తర్వాతి సినిమాగా ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ (Spirit) అనే పిక్చర్‌ చేయనున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో అంచనాలు భారీ పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్‌ ఎవరు, హీరోయిన్లు ఎవరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. రెండో ప్రశ్నకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తొలి ప్రశ్నకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో పేరు సమాధానంగా వినిపిస్తోంది. గతంలో ఓసారి విలన్‌గా నటించడంతో ఈ సినిమాను కూడా ఆయన ఓకే చేయొచ్చు అని చెబుతున్నారు. ఇన్ని చెప్పి ఆయన పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? ఇంకెవరు బాలీవుడ్‌ కత్రోంకీ కిలాడీ అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar). ‘2.0’ (Robo 2.O) సినిమాతో ఇప్పటికే ఆయన ఓసారి విలన్‌ అయ్యారు. ఇప్పుడు ‘స్పిరిట్‌’లో ఆయనను అడుగుతున్నారట.

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ (Prabhas) కాంబో అనగానే చాలా అంచనాలు నెలకొన్నాయి. సందీప్ సినిమాల్లో చూపించే హీరోయిజానికి ప్రభాస్ కటౌట్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ సినిమాకు అక్షయ్‌ యాడ్‌ అయితే… సినిమా ఇంకాస్త బజ్‌ పొందుతుంది అని చెప్పాలి. ‘యానిమల్‌’ సినిమాలో హీరో పాత్ర, విలన్‌ పాత్రల చిత్రణను చూసిన అక్షయ్‌ ‘స్పిరిట్‌’లో విలన్‌గా చేయడానికి ఓకే చెప్పారు అని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా కరీనా కపూర్‌ (Kareena Kapoor) నటిస్తోందని ఆ మధ్య చెప్పారు. మరో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి (Tripati Dimri) నటించొచ్చు అని మరో వార్త వచ్చాయి. ఆ తర్వాత రష్మిక మందన (Rashmika) పేరు కూడా చర్చలోకి వచ్చింది. అయితే ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.