March 23, 202506:02:06 AM

Prabhas: ‘స్పిరిట్‌’లో ముగ్గురు హీరోయిన్లట… ఈ సారి ట్రెండింగ్‌లో ఎవరంటే?

ప్రభాస్‌ (Prabhas) సినిమాలు ఇప్పుడు రెండు సెట్స్‌ మీద ఉన్నాయి. త్వరలో మూడో సినిమా సెట్స్‌ మీదకు వస్తుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో, సినిమా వర్గాల్లో ఎటు చూసినా ప్రభాస్‌ అప్‌డేట్సే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. తాజాగా ఆ మూడో సినిమా ‘స్పిరిట్‌’ (Spirit) గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అది ఈ సినిమా హీరోయిన్ల గురించే. ఎందుకంటే ఈ సినిమాలో కొన్నాళ్ల క్రితం చెప్పిన ఒక హీరోయిన్‌ కాదు, ఇటీవల వరకు చెప్పిన ఇద్దరు హీరోయిన్లు కాదు.. ఏకంగా ముగ్గురు నాయికలు ఉంటారు అంటున్నారు.

‘యానిమ‌ల్‌’ (Animal) సినిమాలో నేషనల్‌ వైడ్‌ బ్లాక్‌బస్టర్‌ కొట్టారు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) . ఆ సినిమాతో ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ అనే సినిమా చేస్తారని ముందే చెప్పేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది. ప్ర‌భాస్‌ని సందీప్ రెడ్డి వంగా ఎలా చూపిస్తారో అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబ‌రులో ఉంటుంది అంటున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ల సంగతి ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారట సందీప్‌ రెడ్డి. పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న సినిమా అయినా.. హీరోయిన్ల విషయంలో ‘యానిమల్‌’ స్టైల్‌నే వాడాలని ఫిక్స్‌ అయ్యారట. అంటే హీరోయిన్‌ను సౌత్‌ సినిమాల్లో బిజీగా ఉండే నాయికనే ఎంచుకుంటారు అని అంటున్నారు. అంతేకాదు హీరోయిన్‌గా ర‌ష్మిక మందన(Rashmika Mandanna) , కీర్తి సురేష్‌ (Keerthy Suresh) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేర్లు ప‌రిశీలిస్తున్నట్లు వార్తలొసస్తున్నాయి. అయితే ఈ ముగ్గురూ కాదని ఇందులో ఒక్కరే ఫైనల్‌ అవుతారు అని అంటున్నారు.

ప్రభాస్‌ – హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రావొచ్చు అని చెబుతున్న సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ ఫిక్స్‌ అని అంటున్నారు. అదే జరిగితే ‘స్పిరిట్‌’లో ఉండకపోవచ్చు. అప్పుడు రష్మిక, కీర్తి సురేశ్‌లో ఒకరు అవుతారు. అయితే హీరోయిన్‌తోపాటు ‘యానిమల్‌’ సినిమాలోని జోయా పాత్ర లాంటిది మరొకటి ఉంటుందట. అలాగే ఓ ఐటెమ్‌ సాంగ్‌ కూడా ఉంటుందట. అలా ఎలా చూసినా ఈ సినిమాలో ముగ్గురు నాయికలు పక్కా అని చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.