Rajinikanth: ఎన్నికల టైమ్‌ ఇది… ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోంది: రజనీకాంత్‌ కామెంట్స్‌ వైరల్‌!

ఆ మధ్య ఓసారి రజనీకాంత్‌ (Rajinikanth) ఓ రాజకీయ పార్టీ నాయకుడి గురించి మాట్లాడితే ఎంత రచ్చ జరిగిందో గుర్తుందా? సూపర్‌ స్టార్‌ గురించి తెలిసినవాళ్లు కూడా మరో పార్టీ తరఫున మాట్లాడుతూ ఆయనను దుమ్మెత్తిపోశారు. ఎందుకన్నారు, ఎలా అన్నారు, ఎప్పుడు అన్నారు అనేది కూడా తెలియకుండా రజనీని ట్రోల్‌ చేశారు. ఆ ఎఫెక్ట్‌ వల్లనో, లేక ఇంకే కారణమో తెలియదు కానీ… రజనీకాంత్‌ రీసెంట్‌ ఎన్నికల టైమ్‌ ఇది… ఊపిరి తీసుకోవలన్నా భయం వేస్తోంది అని కామెంట్ చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.

చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన రజనీకాంత్‌… ఎంతోమందికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలుపుతున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఆ ఆసుపత్రి గురించి ఘనంగా చెప్పుకొచ్చారు. గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే కమల్‌ హాసన్‌ ఇంటి దగ్గర అని అనేవారని, ఇప్పుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) ఇల్లు కావేరి ఆసుపత్రి దగ్గర ఉంది అని అంటున్నారు అని పొగిడేశారు. ఈ క్రమంలో పొలిటికల్‌ డైలాగ్ వేశారు రజనీ.

ఇప్పుడు కమల్‌ గురించి తాను అన్నది కాజ్యువల్‌గా మాత్రమేనని, మళ్లీ నాకు, కమల్‌కు మధ్య విభేదాలున్నాయని రాయకండి అంటూ మీడియా మీద ఛలోక్తులు విసిరారు. మీడియా వాళ్లు ఉన్నప్పుడు మాట్లాడాలంటే ఈ మధ్య కాస్త సంకోచిస్తున్నాను. ఈ కెమెరాలను చూస్తుంటే భయమేస్తోంది. అందులోనూ ఇది ఎన్నికల సమయం. నేను ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను అని సరదాగా కామెంట్‌ చేశారు రజనీకాంత్.

అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జనాల ట్రోలింగ్ వల్లనే ఇలా అన్నారు అంటూ కొందరు చర్చిస్తున్నారు. గతంలో తాను అనేక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నానని, ఎంతోమంది డాక్టర్ల వల్లే ఇప్పుడిలా హాయిగా ఉన్నానని రజనీ మాట్లాడారు. ఇక రజనీ సినిమాల విషయానికొస్తే.. టీజీ జ్ఞానవేల్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో ‘వెట్టయాన్’ అనే సినిమా చేస్తున్నారు. ‘వేటగాడు’ పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.