Ram Charan: చరణ్ లాంటి నటుడు కావాలన్న హాలీవుడ్ సంస్థ.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నత్తనడకన జరుగుతుండగా ఈ ఏడాది వినాయక చవితి పండుగకు లేదా క్రిస్మస్ పండుగకు ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ లో ఎక్కువ సంవత్సరాల పాటు షూట్ జరుపుకున్న సినిమా ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హాలీవుడ్ లో నటీనటులను ఎంపిక చేసే ప్రముఖ సంస్థ ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొందరు హాలీవుడ్ స్టార్స్ ఫోటోలు, పేర్లతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో పోలీస్ గెటప్ లో ఉన్న చరణ్ ఫోటోను సైతం షేర్ చేయడం జరిగింది.

రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో హాలీవుడ్ సంస్థ ప్రకటనను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. భవిష్యత్తులో హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తానని రామ్ చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో చరణ్ హాలీవుడ్ ఎంట్రీ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. చరణ్ రాజమౌళి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ (Ram Charan) సరైన ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరిన్ని సంచలన విజయాలు సొంతం కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ లో ఉండటంతో హాలీవుడ్ సంస్థలు సైతం చరణ్ తరహా నటులు కావాలని పోస్టులు పెడుతున్నాయి. రామ్ చరణ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.