March 19, 202501:12:29 PM

Ram Charan: పుట్టినరోజున రామ్ చరణ్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలను అభిమానులు గ్రాండ్ గా జరుపుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత విషయాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఆస్తుల విలువ 1370 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. చరణ్, ఉపాసన ఆస్తుల విలువ ఏకంగా 2500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో ఆస్తులు ఎవరి దగ్గరా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామ్ చరణ్ కు ఇన్ స్టాగ్రామ్ లో నాలుగు రోజుల క్రితం వరకు 21.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డులను బ్రేక్ చేసి 21.8 మిలియన్ ఫాలోవర్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకోవడం గమనార్హం. చరణ్ ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. సౌత్ లో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో బన్నీ తర్వాత స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు.

చరణ్ ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. చరణ్ పుట్టినరోజున అరుదైన రికార్డ్ చరణ్ ఖాతాలో చేరడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ (Game Changer)(Game Changer) సినిమా నుంచి విడుదలైన జరగండి లిరికల్ వీడియోకు ఇప్పటికే 2.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో చరణ్ ఇన్ స్టా ఫాలోవర్ల విషయంలో నంబర్ వన్ గా నిలుస్తారేమో చూడాలి.

రామ్ చరణ్ కు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్లే ఈ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కు సంబంధించి కూడా త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి సాంగ్ కోసం 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. కియారా అద్వానీ డ్యాన్స్ స్టెప్స్ మరింత మెరుగ్గా ఉండాల్సిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.