March 22, 202504:48:45 AM

Ram Charan: తారక్‌ కథతో చరణ్‌… అయినా ఎందుకింత డిస్కషన్‌ పెడుతున్నారు?

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో ఎప్పుడూ చేయలేదా? నాకు తెలిసి చాలామంది హీరోలు ఇలా చేసుంటారు, చాలా మంది హీరోలకు ఇలా అయి ఉంటుంది కూడా. వదిలేసిన కథ అద్భుతమైన విజయం సాధించి ఉంటుంది. అప్పుడు అయ్యో వదిలేశామే అని బాధపడిన హీరోలూ ఉన్నారు. భలే నా దగ్గరికొచ్చింది అని ఆనందపడిన హీరోలూ ఉన్నారు. ఇక అభిమానుల సంగతి అయితే సరేసరే. ‘మావోడు మిస్‌ అయ్యడు హమ్మయ్య’, ‘ఆ హీరో చేసుంటే ఎలా ఉండే ఏమో… మా వోడికి భలే సెట్‌ అయ్యింది’ అని అనుకుంటుంటారు.

అయితే, ఇప్పుడు ఓ హీరో అభిమానులు మాత్రం తెగ సందడి చేస్తున్నారు. నిజానికి వారు అభిమానులో కాదో తెలియదు కానీ ఆ హీరో అభిమానులం అని చెప్పి సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. ఇక్క కథ వదిలేసిన హీరో ఎన్టీఆర్‌ (Jr NTR)  కాగా, కథ అందుకున్న హీరో రామ్‌చరణ్‌(Ram Charan) . ఇప్పుడు ఆ సినిమా ఏంటో మీకే అర్థమై ఉంటుంది. అవును బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) సినిమా గురించే ఇదంతా. అదేంటి ఎప్పుడు అనౌన్స్‌ అయిన సినిమా కదా… ఇప్పుడెందుకు చర్చ అనుకుంటున్నారా? ఇప్పుడు సినిమా టైటిల్‌ బయటకు వచ్చింది కాబట్టి.

‘ఉప్పెన’ (Uppena) సినిమా తర్వాత తారక్‌తో సినిమా చేస్తా అని బుచ్చిబాబు సానా… హఠాత్తుగా రామ్‌చరణ్‌ దగ్గరకు వచ్చేశారు. సినిమా త్వరలో షురూ అని అనౌన్స్‌ కూడా చేసేశారు. దీంతో తారక్‌ కథతోనే చరణ్ చేస్తున్నాడు అని తేల్చేశారు ఫ్యాన్స్‌. అందులో కథ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ అనేసరికి ఆ కథ ఇదే అని పక్కా అయిపోయారు. ఈ చర్చ చాలా రోజులే నడిచింది. అయితే ఇక సద్దుమణిగింది అనుకుంటుండగా… ఈ సినిమా ‘పెద్ది’ అనే పేరు పెడుతున్నారని ఓ పుకారు బయటకు వచ్చింది.

దీంతో మళ్లీ పాత చర్చ మొదలైంది. అయితే ఇలానే ప్రతి హీరో ఫ్యాన్స్‌ అనుకుంటే… ‘అతడు’ (Athadu) కథ మహేష్‌ బాబు (Mahesh Babu) కాకుండా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేయాలి. ‘ఇడియట్’ (Idiot) కథ రవితేజను (Ravi Teja) కాదని పవన్‌ దగ్గరే ఉండి ఉండాలి. తరుణ్‌ (Tarun) బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘నువ్వే కావాలి’ సుమంత్‌ (Sumanth) చేసి ఉండాలి. అంతేకాదు ‘అరుంధతి’ (Arundhati) సినిమా అనుష్క (Anushka) కాకుండా మమతా మోహన్‌ దాస్‌ (Mamta Mohandas) చేసుండాలి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.