Renu Desai: రెండో పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చేసిన రేణూ దేశాయ్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, సీనియర్ హీరోయిన్ అయిన రేణూ దేశాయ్ (Renu Desai) గురించి నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమె పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేయడం పిల్లల్ని కనడం… ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడం, అనూహ్యంగా విడిపోవడం ఈ విషయాలు ఎవరికీ తెలీనవి కావు. విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో ఒకటి అనడం..

దానికి ఈమె ఎమోషనల్ గా కౌంటర్లు వేయడం వంటివి కూడా అందరికీ తెలిసిన వ్యవహారాలే. ఇది పక్కన పెట్టేస్తే.. 2018 టైంలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రేణూ దేశాయ్ ప్రకటించింది. ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోలేదు. రెండో పెళ్లి ప్రకటన చేసి కూడా ఎందుకు ఆమె చేసుకోలేదు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. చాలా కాలం తర్వాత ఈ విషయం పై రేణూ దేశాయ్ స్పందించింది.

‘రెండో పెళ్లి చేసుకోవడం పై ఇప్పుడు నేను దృష్టి పెట్టలేదు. నా కూతురు ఆద్య ఇప్పుడు స్కూల్ కి వెళ్లే పాప. ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకోవడం అనే అంశం ఆమెకు అర్థం కాదు. ఒకవేళ కాలేజీకి వెళ్లే వయసు వస్తే తాను అర్థం చేసుకునే అవకాశం ఉంది. నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పట్లో అలాంటి ఆలోచన పెట్టుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.