Shah Rukh Khan: అంబానీ ప్రీవెడ్డింగ్‌లో రామ్‌ చరణ్‌కు అవమానం… ఏమైందంటే?

రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ -నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ – రాధిక మార్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను షారుఖ్‌ ఖాన్‌ అవమానించాడా? గత రెండు రోజులుగా ఈ విషయమ్మీదే సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్త పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ కంపెనీల సీఈవోలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో రామ్‌చరణ్‌, ఉపాసన కూడా పాల్గొన్నారు. తెలుగు నుండి వెళ్లిన ఏకైక హీరో చరణే కావడం గమనార్హం.

అయితే ఈ వేడుకలో చరణ్‌కు అవమానం జరిగిందంటూ ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌పై రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌ స్టేజ్‌పై సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌తో కలసి రామ్‌చరణ్‌ ‘నాటు నాటు’ స్టెప్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి ముందు ముగ్గురు ఖాన్‌లు కలసి తమదైన స్టైల్‌లో స్టెప్పులేశారు. ఈ క్రమంలో చరణ్‌ను పిలిచి మాకు స్టెప్పు వేయడం నేర్పించమన్నారు. అయితే ఆ పిలుపులో షారుఖ్‌ కాస్త వెటకారం జోడించాడు. పెద్ద వేదిక ముందు చరణ్‌ను పిలుస్తూ ‘ఎక్కడున్నావ్‌… ఇడ్లీ తింటూ ఎక్కడున్నావ్‌’ అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.

అయితే… ఈ మాటలు అంటున్నప్పుడే చరణ్‌ స్టేజీ మీదకు వచ్చాడు, ముగ్గురు ఖాన్‌లను (Shah Rukh Khan) అంబానీ ఫ్యామిలీని విష్‌ చేసి స్టెప్పులేసి సందడి చేశాడు. అయితే షారుఖ్‌ సరదాకి అలా పిలిచినట్లు లేదని, ప్రపంచవ్యాప్త ప్రముఖుల ముందు స్టార్‌ హీరోను అలా ఇడ్లీ తింటున్నావా అంటూ కామెంట్ చేయడం సరికాదని అభిమానులు అని పిలిచే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షారుఖ్‌ మాటలు చూస్తుంటే బాలీవుడ్‌కు టాలీవుడ్‌పై ఉన్న చిన్నచూపు అలాగే ఉందనిపిస్తోంది అంటూ ఘాటైన కామెంట్స్‌ కూడా కొన్ని కనిపిస్తున్నాయి.

అయితే, చరణ్‌కి మాత్రమే ఆహ్వానం దక్కడంతో టాలీవుడ్‌లో ఉన్న ట్రోలర్లు, కొంతమంది ఫ్యాన్స్‌ కావాలనే ‘చరణ్‌కు అవమానం’ అంటూ రచ్చ చేస్తున్నారు అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే సరదాగా జరిగిందా, నిజంగానే చరణ్‌ ఇబ్బంది పడ్డాడా అనేది ఆయనే చెప్పాలి.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.