March 21, 202501:40:50 AM

Shah Rukh Khan: నాటు నాటు @ ‘అంబానీ’… ముగ్గురు ఖాన్స్‌ ఏం చెప్పారంటే?

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక గురించి ఇంకా జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే… ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రముఖుల ప్రయాణం, బస, విందు, అలంకరణ, వేడుకకు ఏకంగా రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ వేడుకలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఖాన్‌ త్రయం డ్యాన్స్ గురించి ఆ ముగ్గురూ చెప్పిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుకలో బాలీవుడ్ దిగ్గజ హీరోలు (Aamir Khan) ఆమిర్‌ ఖాన్‌, (Salman Khan) సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ ( Shah Rukh Khan) ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేసి సందడి చేశారు. అయితే డబ్బు తీసుకునే వీరు డ్యాన్స్ చేశారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఖాన్ త్రయం స్పందించింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ముగ్గూరు స్పందించినా… ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడం గమనార్హం.

కూతురు పెళ్లిలో డాన్స్ చేయలేదు కానీ, డబ్బులిస్తే అంబానీ పెళ్లిలో డాన్స్ చేశాడంటూ అమీర్ ఖాన్‌పై విమర్శలు వచ్చాయి. నా కూతురు పెళ్లిలో డాన్స్ చేశానని, కాకపోతే ఆ వీడియో బయటకు రాలేదని, అంబానీ పెళ్లిలో డాన్స్ చేసిన వీడియో బయటకొచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. అయినా సెలబ్రేషన్‌లో డ్యాన్స్ చేయడం కామన్ అంటూ విమర్శలకు రిప్లై ఇచ్చాడు. ఆత్మీయుల వేడుకల్లో డాన్స్ చేస్తే తప్పేంటని షారుఖ్‌ ఖాన్‌ ప్రశ్నించాడు.

తన ఇంట్లో పెళ్లి జరిగితే అంబానీ కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేస్తారని అని అన్నాడు. కొన్ని వేడుకల్లో డ్యాన్స్ చేయాలని మనసుకు అనిపిస్తుందని, అప్పుడు మాత్రమే డ్యాన్స్‌ చేస్తానని సల్మాన్‌ ఖాన్‌ చెప్పాడు. అంతే కానీ డబ్బు కోసం అలాంటి పనులు చేయనని సల్మాన్‌ అన్నాడు. అయితే ఈ వ్యవహారంలో రామ్ చరణ్ ఏమంటాడో చూడాలి. ఎందుకంటే ఆ పాట ఆఖరులో ముగ్గురు ఖాన్‌లతో కలసి రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా ఆ పాటకు స్టెప్పేశాడు మరి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.