March 18, 202503:01:47 AM

The Goat Life: ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ రియల్ హీరో ఇతనే!

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ‘సలార్’  (Salaar) తో చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.దాని వల్ల అతనికి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో అతని ‘గోట్ లైఫ్: ఆడు జీవితం’ (The Goat Life)  సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ డీసెంట్ వసూళ్లు సాధిస్తుంది. మలయాళంలో అయితే కుమ్మేస్తుంది.

ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర చాలా నేచురల్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాడు అతను. టెక్నికల్ టీం కూడా చాలా బాగా కష్టపడింది. అయితే ఇది 2008లో వచ్చిన ‘గోట్ డేస్: ఆడు జీవితం’ అనే నవల ఆధారంగా రూపొందింది. మలయాళ రైటర్ బెన్యామిన్ ఈ నవలను రచించారు. ‘జైలు, ఎడారి, తప్పించుకోవడం, తిరస్కరణ’ వంటి 4 భాగాలుగా ఈ నవల రూపొందింది.

అలాగే ఈ నవల కేరళకు చెందిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా బెన్యామీను రచించడం జరిగింది. నజీబ్ మహమ్మద్ కుటుంబానికి మంచి ఆదాయం కోసం అతని భార్య 8 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలకు వలస కూలీగా వెళ్లాడు.వలస కూలీగా వెళ్లిన నజీబ్ మహమ్మద్ బానిసగా మారిపోతాడు. దానినే ఈ సినిమాలో వివరంగా చూపించారు. ఇప్పుడు నజీబ్ మహమ్మద్ ఫోటోలు అలాగే అతని ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.